హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ హామీల విషయంలో కాంగ్రెస్ సర్కా ర్ పూర్తిగా విఫలమైందని బీజేపీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలులో వైఫల్యం పేరిట బీజేపీ తెలంగాణ సోమవారం రోజు రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ ఏర్పాటు చేసింది.
సాగర్ రోడ్డు లో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బొంగులూరు వద్ద ఉన్న వేద కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.
కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, బీజే పీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై బీజేపీ చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగానే ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.