calender_icon.png 20 January, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి పనిచేస్తుంది....

20-01-2025 06:47:22 PM

అంబేద్కర్ పై కాంగ్రెస్ ది కపట ప్రేమ...

ఎన్నికల్లో అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర... రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ కే ఉంది..

75 సంవత్సరాల భారత రాజ్యాంగ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సంవిధాన్ గౌరవ్ అభియాన్ పేరిట కార్యక్రమాలు..

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ....

కరీంనగర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని నిజమాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ(MLA Dhanpal Suryanarayana) తెలిపారు. బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజున కరీంనగర్ లోని సాయి మహాలక్ష్మి గార్డెన్లో సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమ సన్నాక సమావేశం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... అంబేద్కర్ పై కాంగ్రెస్ ది కపట ప్రేమ అన్నారు. గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బాబా సాహెబ్ డా. భీమ్ రావు అంబేద్కర్ ను పలుమార్లు అగౌరవపరిచిందన్నారు. అంబేద్కర్ పై కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేక మనస్తత్వం కారణంగా భారతరత్న ఇవ్వలేదని, పాత పార్లమెంట్ హాల్లో కనీసం అంబేద్కర్ ఫోటోను పెట్టలేక పోయిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్కే ఉందని, రాజ్యాంగాన్ని కాలరాసి దేశంలో ఎమర్జెన్సీ రోజులు తీసుకువచ్చిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు.

కాంగ్రెస్ విభజన ఎజెండాకు వ్యతిరేకంగా దేశాన్ని రక్షించడంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. ముఖ్యంగా బిజెపి ఎప్పుడు అంబేద్కర్ అడుగజాడల్లోనే నడుస్తుందన్నారు. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి బిజెపి కృషి చేసిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం కోసం కృషి చేసేందుకు, శాశ్వత స్ఫూర్తిని రగిలించేందుకు అంబేద్కర్ జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను బిజెపి మోడీ ప్రభుత్వం పంచ తీర్థంగా మార్చిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం చూపిన బాటతోనే 370 ఆర్టికల్ రద్దు జరిగిందన్నారు. బిజెపి రిజర్వేషన్ లను పొడిగించిందని, అట్రాసిటీ చట్టాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. బిజెపి అంబేద్కర్ ను గౌరవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుస్తుంటే కాంగ్రెస్ బిజెపి పై దుష్ప్రచారాన్ని ప్రారంభించిందని, రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. ముఖ్యంగా బిజెపి శ్రేణులు కాంగ్రెస్ దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని, సంవిదాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ నిర్దేశించిన మేరకు కార్యక్రమాలు విజయవంతంగా జరగాలన్నారు. ముఖ్యంగా షెడ్యూలు కులాలు, తెగలు, మేధావులు, స్త్రీలు, యువత వంటి వర్గాల్లో, కాలేజీలు, హాస్టల్లో ప్రచారం నిర్వహించాలని, రాజ్యాంగ ప్రతులు పంపిణీ చేయాలన్నారు.

26వ తేదీ రిపబ్లిక్ డే వేడుకల రోజున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించడంతో పాటు, భారత రాజ్యాంగ విలువలు సూత్రాల గురించి ప్రజల్లో తగిన అవగాహన కల్పించి సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ శాసనసభ్యురాలు బోడిగే శోభ, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు రాజేంద్ర ప్రసాద్, కొమల ఆంజనేయులు, కన్నెబోయిన ఓదెలు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, సినీయర్ నాయకులు వాసాల రమేష్, బీజేపీ సoవిధన్ జిల్లా కో ఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి, ఎడవెల్లి శశిధర్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు, జిల్లా అధికార ప్రతినిధిలు బొంతల కల్యాణ్ చంద్ర, అలివెలి సమ్మిరెడ్డి, దండు కొమురయ్య, పుప్పాల రఘు, మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, సంవిధన్ మండల కో అర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.