calender_icon.png 3 April, 2025 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సచివాలయం ముట్టడికి బీజేపీ మహిళా మోర్చా యత్నం

03-04-2025 12:20:39 AM

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వేలం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి సంఘాలు సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో బుధవారం హెచ్‌సీయూ భూముల వేలాన్ని వ్యతిరే కిస్తూ బీజేపీ మహిళా మోర్చా నేతలు సచివాలయం ముట్టడికి యత్నించారు.

సచివాలయం సమీపంలోకి రాగానే అప్రమత్తమై న పోలీసులు మహిళా నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ మహిళా నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి సహా వందలాది మందిని నెక్లెస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.