09-02-2025 01:28:12 AM
లక్నో, ఫిబ్రవరి 8: ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అభ్యర్థి చంద్రభాన్ పాస్వాన్ తన సమీప సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజిత్‌ప్రసాద్‌పై 60 వేల కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు.
బీజేపీ గెలుపు తర్వాత యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు కథ ముం దుందని ధీమా వ్యక్తం చేశారు.