06-03-2025 05:52:54 PM
కుకునూరుపల్లి మండల బిజెపి అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి..
కొండపాక (విజయక్రాంతి): బిజెపి పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికలలో విజయం సాధించారు. కరీంనగర్ మెదక్ అదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా కుక్కునూరుపల్లి మండల కేంద్రంలో గురువారం బిజెపి పార్టీ మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అనుముల సంపత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచి, భారతీయ జనతా పార్టీని కుకునూరుపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో మరింత పటిష్ట పరుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ నెంబర్ గౌరారం కృష్ణ, జనరల్ సెక్రటరీలు దాసరి స్వామి, నాగరాజు, ఉపాధ్యక్షులు బోనాల రాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఏ నాగరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు డి కుమారస్వామి, యువ మోర్చా మండల అధ్యక్షులు నవీన్, వివిధ గ్రామాల బూతు అధ్యక్షులు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.