calender_icon.png 12 February, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం..

09-02-2025 04:18:17 PM

గాంధీనగర్లో బీజేపీ శ్రేణుల విజయోత్సవ సంబరాలు

ముషీరాబాద్,(విజయక్రాంతి): దేశ రాజధాని న్యూఢిల్లీ లో కాషాయ ప్రభంజనం మొదలైందని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్(Corporator A. Pavani Vinay Kumar) అన్నారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రయోజనం సృష్టించి విజయం సాధించిన  సందర్భంగా గాంధీనగర్ డివిజన్లోని ఆంధ్ర కేక్ వద్ద బిజెపి శ్రేణులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాణా సంచా పేల్చి విజయోత్సవ  సంబరాలు జరుపుకున్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అవినీతి, అసమర్థ ఆప్ ప్రభుత్వాన్ని ఇడ్చి పారేసిన ఢిల్లీ ప్రజలు, సభ్ కా సాత్, సభ్ కా వికాస్, సభ్ కా విశ్వాస్ నినాదంతో దేశ ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి భారీ మెజారిటీతో విజయాన్ని అందించారని, గెలుపొందిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విజయం బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని, రెట్టింపు ఉత్సాహంతో ఢిల్లీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కార్పొరేటర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, vst రాజు, ఎం.ఉమేష్, మహమూద్, సత్తి రెడ్డి, ప్రకాష్ గౌడ్, పాల శ్రీనివాస్, మదన్మోహన్, నర్సింహ, శ్రీనివాస్, సాయి కుమార్, ఆనంద్ రావు, సత్యేంధర్, యాదగిరి, రఘు యాదవ్, నీరజ్, మంగమ్మ, సంధ్యా రాణి, పూర్ణ, సంయుక్త రాణి, కృష్ణ వేణి, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.