calender_icon.png 8 April, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాబోయే రోజుల్లో తెలంగాణలో భాజపాదే విజయం

06-04-2025 07:47:58 PM

కొల్చారం (విజయక్రాంతి): రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీది విజయమని భాజాపా మండల శాఖ అధ్యక్షులు పంతులు హరీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం నాడు మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత భాజాపాదేనని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా భాజపా విజయదుందుభి మోగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పల్లె రవికాంత్, మండల సీనియర్ నాయకులు బాబా గౌడ్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, మండల బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్, జిల్లా నాయకులు అంజా గౌడ్, బూత్ ప్రధాన కార్యదర్శి కొత్త కిరణ్, తలారి లక్ష్మణ్, బూత్ వైస్ ప్రెసిడెంట్ పెంటయ్య, బూత్ వైస్ ప్రెసిడెంట్ దిబ్బనూరు మల్లేష్, కిషన్, బీజేవైఎం నాయకులు రంజిత్, సాయి కుమార్, దేవ్ బీరప్ప, ఎస్సీ మోర్చా నాయకులు సత్తయ్య, కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.