calender_icon.png 20 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటికీ బీజేపీ

20-04-2025 12:00:00 AM

కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ 

 నాగోల్ డివిజన్‌లో బీజేపీ నాయకుల ‘గావ్ చలో.. బస్తీ చలో’

ఎల్బీనగర్, ఏప్రిల్ 19 : నాగోల్ డివిజన్‌లో ఇంటింటికీ బీజేపీ చేరుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవ్ అన్నారు. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల సందర్భం గా బీజేపీ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్ అధ్యక్షతన కార్పొరేటర్ అరు ణా సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ’గావ్ చలో బస్తీ చలో’ కార్యక్రమం నిర్వహించారు.

నాగోల్ డివిజన్ లోని ఆంజనేయస్వామి ఆలయ పరిసర ప్రాంతాన్ని బీజేపీ నాయకులు శుభ్రం చేశారు. అనంతరం  బస్తీలో పర్యటించి, బీజేపీ జెండానం ఆవిష్కరించారు. 40 ఏండ్లుగా బీజేపీకి  సేవలు అందిస్తున్న సీనియర్ నాయకులను సన్మానించారు. అనంతరం బస్తీ వాసులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నాగోల్ డివిజన్ ఇన్ చార్జి బండారి భాస్కర్, మహిళా నాయకులు, బూత్ స్థాయి అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.