calender_icon.png 18 January, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేసారి బీజేపీదే అధికారం

11-07-2024 02:43:20 AM

ఇప్పటికే ప్రజల విశ్వాసం రేవంత్ కోల్పోయారు

మల్కాజిగిరి నియోజకవర్గంలో కృతజ్ఞత సభలో ఎంపీ ఈటల 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారం చేపడుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో బుధవారం జరిగిన కృతజ్ఞత సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హాయాంలో అన్ని సంకీర్ణ రాజకీయాలే ఉండేవన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎంత శక్తిమంతమైందో ఎన్నికల్లో గమనించినట్టుగా పేర్కొన్నారు. మల్కాజిగిరి ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల్లో ఓట్లు వేసి ధర్మాన్ని కాపాడారని అన్నారు.

దేశ భద్రత, సమగ్రత బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని ప్రజలు భావించి ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారన్నారు. యుద్ధం జరిగే దేశాలకు వెళ్లి శాంతి గురించి మాట్లాడే ధైర్యశాలి మోదీ అని కొనియాడారు. దేశంలోని పార్టీలన్నింటికీ బీజేపీ పార్టీకి వచ్చినన్నీ పార్లమెంటు సీట్లు రాలేదన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ప్రతి ఏడాది రూ. 2 లక్షల కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. రుణమాఫీ చేయడానికి దేవునిపై ప్రమాణం చేయాల్సి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్రోటోకాల్స్ ఈ రోజు ఉంటాయి.. రేపు పోతాయని ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీజేపీ విజయం సాధించే దిశగా ప్రచారాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీపై ఇష్టాన్ని పెంచుకొని గెలుపు తీరానికి చేర్చవల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అనంతరం నాయకులు ఈటలను సత్కరించారు.