calender_icon.png 12 February, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఎన్నికల్లో బీజేపిదే అధికారం

11-02-2025 11:11:03 PM

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి...

నిర్మల్ (విజయక్రాంతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి ప్రభుత్వం అధికారంలో రానుందని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపి  ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పట్ట భద్రుల అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్‌ర్ల అభ్యర్థి మల్క కొమురయ్యతో కలిసి నిర్మల్‌లో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మోడి నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వంను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. డిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపిని ఓడించేందుకు ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలు మాత్రం బీజేపి ప్రభుత్వంను కోరుకున్నారని తెలిపారు. ప్రజలకు మోడి ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్రంలో కూడ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు వచ్చాయని రాబోయో ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యదిక అసెంబ్లీ సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.గతంలో రాష్ట్రంను పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పరి పాలర కొనసాగుతుందని ఆరోపించారు.

ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తు కాలం గడుపుతుందన్నారు. రైతులను ఉద్యోగులను, మహిళలను నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎమ్మెల్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు. ఎన్నికల్లో ఓడి పోతామన్న భయంతో బీఆర్‌ఎస్ నుండి అభ్యర్థులు ఎవరు ముందుకు రాకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉందని బీజేపి ఎమెల్పీ అభ్యర్థులు గెలువడ ఖాయం అన్నారు. రెండు పార్టీలు బీజేపి అభ్యర్థులు గెలువకుండా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపి ఎమ్మెల్పీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నేతలు కార్యకక్తలు పని చేయాలని సూచించారు. ఈ సమావేశం ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఇన్‌చార్జ్ మల్లా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, అయ్యన్న గారి భూమయ్య తదితరులు ఉన్నారు.