26-02-2025 12:00:00 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 23: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తుందని పార్టీ మండల అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనను ఆదివారం ముడిమ్యాల గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు సీనియర్ నేత ఊరడి రాములు ఆధ్వర్యంలో కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అనంత రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ గ్రామ స్థాయిలో బలపడుతూ, ప్రజల మద్దతు పెంచుకుంటోందని పేర్కొన్నారు.
కార్యకర్తలు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవే యాలని సూచించారు. కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు గా నిలుస్తోందని, 19 వ విడత నిధులను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారని గుర్తుచేశారు.
పార్టీ కార్యకర్తలకు ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించిన ఆయన పార్టీని బూత్ స్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సూద శ్రీను, ఊరడి రాములు, ప్రవీణ్, దామరిగిద్ద శ్రీరాములు, ఊరడి మల్లేశ్, అంజయ్య, మహేందర్ తదితర నేతలు పాల్గొన్నారు.