కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): రాబోయే 45 రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కృష్ణంరాజు జయంతిలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ అధికారులు, నేతలు విదేశీ పర్యటనలతో లాభం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.