03-05-2024 01:21:53 AM
కాంగ్రెస్ నేత గజ్జల కాంతం
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రిజర్వేషన్లను రద్దు చేసి దేశాన్ని పాలించాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయని, ఆ ఆలోచనే పార్టీ వినాశనానికి కారణభూతమవుతుందని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికే ఆ పార్టీ 400 ఎంపీ సీట్ల టార్గెట్ పెట్టుకున్నదన్నారు. ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం శనివారం తాను దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలపై అత్యాచారాలు, దాడులు జరగుతున్నాయన్నారు. వీటిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 14 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.