07-04-2025 03:10:32 PM
బీజేపీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): ప్రజల సంక్షేమం కోసమే బిజెపి ఆవిర్భవించిందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్(BJP State Treasurer Bandari Shanthi Kumar) అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ లోని వారి నివాసంపై బీజేపీ జెండాను బండారి శాంతికుమార్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ప్రజల మధ్యన ఉన్నందుకే ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించిందని పేర్కోన్నారు. డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా సిద్ధాంతం ప్రకారం బీజేపీ ముందుకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.
1984 వ సంవత్సరంలో కేవలం రెండు స్థానాలలోనే విజయం సాధించిన పార్టీ క్రమక్రమంగా ఎదిగి బలమైన శక్తిగా అవతరించిందని శాంతికుమార్ అన్నారు. క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసే వారికి బీజేపీలో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన వివరించారు. విలువల కోసం, సిద్ధాంతాల కోసం పనిచేసే వారు బీజేపీలో ఉన్నారని శాంతికుమార్ స్పష్టం చేశారు. దేశ ప్రజలు కేంద్రంలో వరుసగా మూడవసారి బీజేపీకి అవకాశం ఇవ్వడంతో నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రస్తుతం దేశంలో సమర్థవంతమైన పరిపాలన కొనసాగుతుందని భండారి శాంతికుమార్ పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా రాష్ట్ర నాయకులు కొండయ్య, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, నంబి రాజు, ఆంజనేయులు, పిల్లి సూర్యనారాయణ, నాగరాజు, మఠం మయుర్నాథ్, కురుమూర్తి, మల్లేష్, కిట్టు, రవి నాయక్, మున్నూర్ రాజు, దోమ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు