బండి, ఈటల ఆధ్వర్యంలో రెండు బృందాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సాయం అందించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్‌రెడ్డి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందానికి కేంద్రమంత్రి బండి సంజయ్, మరో బృందానికి ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వం వహించనున్నారు. వీరు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఈ నెల ౬ నుంచి ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించనున్నాయి. ఆయా ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రైతులకు ధైర్యం చెప్పేందుకూ బీజేపీ నేతలు సమాయాత్తమవుతున్నారు.
బండి సంజయ్ నేతృత్వంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కలిసి ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈటల ఆధ్వర్యంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రామారావు, బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు కలిసి మహబూబాద్, ములుగు ప్రాంతాలలో పర్యటిస్తారు. బీజేపీ రాష్ట్ర, స్థానిక నేతలు ఎక్కడికక్కడ వరద ప్రాంతాలలో పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు.