13-02-2025 07:57:40 PM
బిజెపి యువమోర్చా మండల అధ్యక్షుడు మట్ట పవన్ రెడ్డి..
హుజరాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్, మెదక్, అదిలాబాద్, గ్రాడ్యుయేట్ పట్టుభద్రుల ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ అంజిరెడ్డి గెలుపు ఖాయమని బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షుడు పట్టా పవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి, శ్రీరాములపల్లి, మల్యాల, రామన్నపల్లి గ్రామాలలో గురువారం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ... పట్టుబద్రులు ఓటుతో తమ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ సిహెచ్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంజిరెడ్డి చేసిన సేవకార్యక్రమాలు మరువలేనివి అన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తారని, 2025లోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని సూచించారు. అంజిరెడ్డి గెలుపుకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.