calender_icon.png 10 March, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ విజయోత్సవ సంబురాలు

07-03-2025 12:07:48 AM

కొత్తపల్లి, మార్చి 6: టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బీజేపీ కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బావు పేట గ్రామం లోని ప్రధాన రహదారిపై  టపాసులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కుంట తిరుపతి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టభద్రులు, టీచర్స్ బిజెపి అభ్యర్థులను గెలిపించడం జరిగిందని, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచానికి భారత్ ఒక దిక్సూచిగా నిలిచింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కడార్ల రతన్, కోమటిరెడ్డి అంజన్ కుమార్, వేముల అనిల్ కుమార్, బైరెడ్డి వంశీ, ఇల్లందుల ఆనంద్, మీరు మల్లేశం, పోర్తి అనిల్, శ్రీకాంత్, గంగారం, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.