07-03-2025 12:00:00 AM
మెదక్, మార్చి 6(విజయక్రాంతి): ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడం పట్ల గురువారం మెదక్ రాందాస్ చౌరస్తాలో, హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నాయకులు సుభాష్చంద్ర బోస్, నాయిని ప్రసాద్, ఎక్కలదేవి మధు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్.రెడ్డి, మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ,మాజీ మండలాధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీపాల్, మండల ప్రధాన కార్యదర్శిలు శ్యాంసుందర్, ప్రభు, మండల మోర్చా నాయకులు కుమార్ నాయక్, పోచయ్య, మండల నాయకులు సురేందర్ గౌడ్, బూత్ అధ్యక్షులు సత్యం ఆంజనేయులు, బీజేవైఎం నాయకులు నిఖిల్, విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ సెల్ నవీన్, బిజెపి కార్యకర్తలుపాల్గొన్నారు.
మునిపల్లిలో..
మునిపల్లి ,మార్చి 6 : కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు మల్క కొమరయ్య, చిన్నమలై అంజిరెడ్డి లు విజయం సాధించడంతో గురువారం నాడు మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి నాయకులు అయ్యప్ప స్వామి, శ్రీనివాస్, కృష్ణమూర్తి, సిద్దయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరులో..
పటాన్ చెరు, మార్చి 6 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందడంపై నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ నాయకులు గురువారం సంబరాలు జరుపుకున్నారు. పట్టణ, మండల కేంద్రాలలో బాణాసంచా కాల్చి సీట్లు పంచిపెట్టారు. తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు.