హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి భారీ విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మిఠాయిలు తినిపించారు. పార్టీ కార్యాలయం బయట పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎంపీ ఈటల సైతం కార్యకర్తలతో కలిసి గెలుపు సంబురాల్లో పాల్గొన్నారు.