న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళనకు దిగారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలను కార్యకర్తలు ఖండించారు. కేజ్రీవాల్ నివాసంలోకి చొచ్చుకెళ్లేందు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం(Central Government), అమిత్ షా, దిల్లీని నేర రాజధాని మార్చిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఢిల్లీలో దోపీడీలు, గ్యాంగ్ వార్ లు, చైన్ స్నాచింగ్ లు పెరిగాయని, మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం కష్టంగా మారిందని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తాం.. ప్రజలకు రక్షణ ఇవ్వడమే తమ తొలి ప్రాధన్యత అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంకు ఢిల్లీ ప్రజల పట్ల ఎలాంటి ఆందోళన లేదు, వాళ్లు(Bharatiya Janata Party ) ఢిల్లీ ప్రజలను ద్వేషిస్తున్నారని ద్వజమెత్తారు. ద్వేషం కారణంగానే గత 25 ఏళ్లలో బీజేపీ డిల్లీలో తిరిగి అధికారంలో రాలేదన్న కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు మావాళ్లు, ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు మా కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే కేజ్రీవాల్ గుండెల్లో గుబులు పుడుతుంది.. మేము చేస్తూ కూర్చోమని మాజీ సీఎం హెచ్చరించారు.
కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తల ఆందోళన
భారతీయ జనతా పార్టీ (బిజెపి) 'పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్'(Purvanchal Samman March) నిర్వహిస్తున్నందున ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల భద్రతను పెంచారు. అశోకా రోడ్డు నుంచి ప్రారంభమైన పాదయాత్ర కేజ్రీవాల్ నివాసం వైపు నిరసనగా సాగింది. శాంతిభద్రతలను నిర్ధారించడానికి ఢిల్లీ పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతాన్ని బారికేడ్ చేశారు. అయినప్పటికీ, నిరసనకారులు ఆఫ్ చీఫ్ నివాసం వెలుపల బారికేడింగ్‌లను బద్దలు కొట్టారు. మరోవైపు, కేజ్రీవాల్ నివాసం వెలుపల నిరసన తెలుపుతున్న పలువురు బీజేపీ కార్యకర్తలు(BJP workers), మద్దతుదారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పూర్వాంచల్ కమ్యూనిటీ ప్రయోజనాలను కేజ్రీవాల్ విస్మరించారని ఆరోపిస్తున్న బీజేపీ నేతల ఆరోపణల మధ్య ఈ నిరసన జరిగింది. పాదయాత్రలో ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
పూర్వాంచలి ఓటర్లపై రాజకీయం టగ్ ఆఫ్ వార్
పూర్వాంచలి ఓటర్ల(Purvanchal Voters) అంశం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్(AAP leader Saurabh Bhardwaj) ఒక ప్రకటనలో పూర్వాంచల్ కమ్యూనిటీని ప్రభావితం చేసే కీలక సమస్యలపై బిజెపి నాయకులు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించారు. "నేను ఢిల్లీ పూర్వాంచలీ నాయకులను అడగాలనుకుంటున్నాను. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా(BJP national president JP) పూర్వాంచలీలను 'చొరబాటుదారులు' అని పిలిచినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు? మనోజ్ తివారీ, పూర్వాంచల్ మోర్చా ఎక్కడ ఉన్నారు? నా నియోజకవర్గంలోని ఛత్ ఘాట్ కూల్చివేయబడినప్పుడు, మనోజ్ తివారీ ఎక్కడ ఉన్నారు?" అంటూ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. బిజెపి ఓటరు అణచివేతకు పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తూ, "ఆప్‌కి మద్దతు ఇస్తున్నందున ఢిల్లీలోని పూర్వాంచలి ఓట్లు తొలగించబడుతున్నాయని ఆరోపించారు. భరద్వాజ్ వ్యాఖ్యలపై బిజెపి కౌంటర్ ఇచ్చింది. ఆప్, కేజ్రీవాల్ పూర్వాంచలి ఓటర్లను అగౌరవపరిచారని ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజధానిలో చెప్పుకోదగ్గ పూర్వాంచలి ఓటర్లను కాపాడుకునేందుకు రెండు పార్టీలు పోటీపడుతున్నాయి.
ఒకే దశలో హస్తిన అసెంబ్లీ ఎన్నికలు
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 5న జరుగుతాయని, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్(Chief Election Commissioner Rajeev Kumar) విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. 70 మంది సభ్యుల అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తుండగా, బిజెపి అన్నింటిని తిప్పికొడుతూ హస్తిన పీఠం దక్కించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, ఆప్ రెండింటినీ లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.