కామారెడ్డి: హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా బుధవారం రాజంపేట మండలలో బీజేపీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు విపుల్ జైన్ విచ్చేశారు. ఈ సందర్భంగా విపుల్ జైన్ మాట్లాడుతూ... స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి మీద జాతీయ జండాను ఎగరవేయాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు కామారెడ్డి నియోజక వర్గ శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో గతవారం రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రేపు స్వాతంత్ర దినోత్సవం కావడంతో ప్రతి ఒక్కరూ జండా వందనము కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు.