calender_icon.png 30 November, 2024 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంకు అంత శక్తి లేదు: కిషన్ రెడ్డి

18-05-2024 03:29:19 PM

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశంలో మేథావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి  ముఖ్యమంత్రి రేవంత్ కు లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.