22-02-2025 06:51:28 PM
నిర్మల్,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల చెందిన బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య(BJP Teacher MLC Candidate Komuraiah) గెలుపు కోసం బహుజనులంతా ఆయనకు మద్దతుగా నిలవాలని బీసీ జేఏ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు, ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం నాయకులు బడి సాబ్ పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో వారు మాట్లాడారు. 36 సంవత్సరాలు పాటు విద్యారంగంలో విశిష్ట సేవలు చేసిన కొమురయ్య గెలవడం వల్ల విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.