calender_icon.png 22 March, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

21-03-2025 11:11:25 PM

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేయండి

బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి

మునుగోడు(చండూర్),(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ మండల కేంద్రంలోని శీలా అనసూయ గార్డెన్స్(Sheela Anasuya Gardens)లో జరిగిన చండూర్ మండలం, మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని  ప్రసంగించారు. రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పోరాటం చేయాలనీ నాయకులకు,కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, జనార్దన్ రెడ్డి, బొబ్బల మురళి మనోహర్ రెడ్డి, పిన్నింటి నరేందర్ రెడ్డి, భూతరాజు శ్రీహరి, అన్నేపర్తి యాదగిరి, ఏనుగు వెంకట్ రెడ్డి, బోడ ఆంజనేయులు,రావిరాల శ్రీను, ఇరిగి ఆంజనేయులు, పడసనబోయిన శ్రీను, వరికుప్పల గిరి, మాదగోని వెంకన్న, భూతరాజు స్వామి, మండల నాయకులు నలపరాజు యాదగిరి, బొబ్బల శివ, సోమ శంకర్, పేర్ల గణేష్, దోటి శివ, వేముల పవన్, దాసరి శంకర్, గుండెల యాదగిరి, పులిజాల రవీందర్, గండు శ్రీకాంత్, రావిరాల ఓంకారం, తీరందాసు శ్రీను, గురిజాల కృష్ణ, కటుకూరి రామలింగం, ఆవుల అశోక్, చిట్టిప్రోలు వెంకటేశం, నీలకంఠం నగేష్, నిమ్మల వెంకన్న, పుల్కరం నాగరాజు, గన్నవరం నాగరాజు, తోకల రవీందర్, బోయపల్లి కిరణ్, పున్న అరుణోదయ ఉన్నారు.