calender_icon.png 7 April, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడమర్తి నాగమణి కుటుంబానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు పరామర్శ

06-04-2025 04:29:24 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు పిడమర్తి నాగయ్య సతీమణి పిడమర్తి నాగమణి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందింది. ఈ మేరకు ఆదివారం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు విచ్చేసి మృతురాలు నాగమణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి మధు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రాపర్తి వెంకన్న, దళిత మోర్చా మండల అధ్యక్షులు ఆరె ప్రభాకర్, మండల నాయకులు గుడెపురి శ్రీను, తాడోజు జనార్ధనా చారి, చామకూరి వెంకటేష్, ఒగ్గు రాములు, కత్తి లచ్చయ్య, చినపంగి నాగరాజు, నాగేంద్ర చారి, ఒగ్గు వినోద్, ఒగ్గు శ్రీను తదితరులు ఉన్నారు.