28-03-2025 05:27:39 PM
స్థానిక సంస్థల్లో బిజెపి సత్తా చాటాలి
బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన దాటిన నేటికి ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ప్రజలను మభ్యపెడుతుందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చొల్లేడు గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పెంబల్ల జానయ్య, కార్యక్రమం ఇన్చార్జి కర్నాటి శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై ప్రజల నుండి దరఖాస్తులను తీసుకున్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం, వృద్ధులకు రూ.4000, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు,పెళ్లయిన ఆడపడుచులకు తులం బంగారం, రైతులకు రైతు భరోసా, 2 లక్షల లోపు బుుణమాఫీ కాని రైతులు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్రంలో ఈ హామీలు నెరవేర్చే విధంగా దరఖాస్తులు ప్రజల తరఫున జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్ భారతీయ జనతా పార్టీ మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భవనం మధుసూదన్ రెడ్డి, పగిళ్ల బిక్షం, బొబ్బిలి యాదయ్య, అక్కెనపల్లి సతీష్, ఒడిగ స్వామి, నెలికంటి రమేష్ యాదవ్ ఉన్నారు.