12-04-2025 05:57:12 PM
అందరికీ సమచిత స్థానం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
గాంవ్ ఛలో - బస్తీ ఛలో కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అన్ని రంగాలను అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ అన్నారు. భూత్పూర్ మండల పరిధిలోని హస్నాపూర్ గ్రామంలో గాంవ్ ఛలో - బస్తీ ఛలో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలలో ఏర్పాటు చేసే వీధి లైట్లు, ఇంటింటికి ఇచ్చే గ్యాస్ కనెక్షన్స్, రోడ్ల నిర్మాణం, ఉచిత ఎరువుల వాడకం, ఫసల్ భీమా పథకం, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరుగుతున్నాయని పేర్కోన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గ్రామాల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. భవిష్యత్ లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబాభవాని ఆలయంలో, టీడీ గుట్ట లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు నర్సింహ రెడ్డి, కార్యదర్శి బుచ్చి రెడ్డి, మండల అధ్యక్షుడు రామిరెడ్డి, కార్యదర్శి గొడుగు ఆంజనేయులు, జిల్లా అధికార ప్రతినిధి కందూర్ రమేష్, బూత్ సభ్యులు, గ్రామ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.