హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఈ నెల 6వ తేదీ మధ్యా హ్నం 3 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ సమా వేశంలో హర్ ఘర్ తిరంగా (ఈ నెల 11నుంచి 15 వరకు) కార్యక్రమం, రైతాంగ సమస్యలు, రుణ మాఫీ కాకుండా బాధపడుతున్న రైతుల సమస్యలు, నిరుద్యోగ యువ త సమస్యలు, మహిళా సమస్యలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైై చర్చించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సహా ముఖ్య నాయకులంతా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.