calender_icon.png 9 February, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రంలో బీజేపీ సంబురాలు

08-02-2025 06:52:03 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ సాధించడంతో మంచిర్యాలలో పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచి గెలుపు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సారథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్టీ 27 ఏండ్ల తరువాత అధికారంలోకి రావడం సంతోషకరం అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పారన్నారు.

గతంలో జరిగిన మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదని, ఢిల్లీ ఎన్నికల్లో మరొకసారి ఖాతా తెరవకుండా తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. మోడీ నేతృత్వంలో త్వరలో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమిరిశెట్టి రాజు, దుర్గం అశోక్, పట్టి వెంకట కృష్ణ, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, తుల ఆంజనేయులు, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, ముదాం మల్లేష్, బోయిని హరికృష్ణ, పల్లి రాకేష్, బింగి సత్యనారాయణ, ఆవిడపు రాజబాబు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, చిరంజీవి, తరుణ్, కామెర అర్జున్, రాజమౌళి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.