- రేవంత్ సవాల్‌ను స్వీకరించిన కమలం నేతలు
- డిసెంబర్ 1 నుంచి అసెంబ్లీల వారీగా పాదయాత్రలు
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి) : మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజల బతుకులు మార్చేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని.. వారు ఒక్కరోజైనా ఆ ప్రాంతం లో గడుపుతారా? అని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను బీజేపీ నాయకులు స్వీకరించారు. ఈనెల 15 లేదా 16వ తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో రాత్రి నిద్ర చేసేందు కు బీజేపీ ముఖ్య నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సీఎం సవాల్‌ను తిప్పి కొట్టి తాము ప్రజల్లోనే ఉన్నామని చాటిచెప్పేందుకు పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసు కున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ ముఖ్య నేతలు మూసీ పరీవాహక ప్రాంతవాసుల ఇండ్లలో ఒకరోజు బస చేసి వారికి అండగా ఉన్నామ ని తెలిపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
అదేవిధంగా.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని సీఎం రేవంత్ ఇచ్చిన హామీ నెరవేరనందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పాదయా త్ర చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.
డిసెంబర్ 7 నాటికి సర్కార్ ఇచ్చిన హామీ లు నెరవేర్చే పరిస్థితి లేదని, తమ పాదయాత్ర ద్వారా ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాల ను వివరించే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అలాగే ప్రజల్లో తమ పార్టీ మద్దతు పెరుగుతుందని ఆశిస్తున్నది.