calender_icon.png 10 May, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ విజయమే లక్ష్యంగా పని చేయాలి

05-04-2025 01:02:49 AM

రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి 

ఎల్బీనగర్, ఏప్రిల్ 4: రంగారెడ్డి రూరల్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ లో బీజేపీ జిల్లా కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడారు. రానున్న రోజుల్లో అటల్ బిహారీ వాజపేయి ఉత్సవాలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అంబేద్కర్, ఫూలే జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు.

రానున్న ఎలక్షన్లలో బీజేపీ విజయమే లక్ష్యం గా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కార్పొరేటర్లు కొప్పుల నర్సింహ రెడ్డి, లచ్చిరెడ్డి, నవజీవన్ రెడ్డి, నాయకులు పేరాల శేఖర్, సుభాష్ చందర్, రవి కుమార్ యా  దవ్, జోర్రిగల శ్రీకాంత్ , కొత్త రవీందర్ గౌడ్, కళ్ళెం బాల్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, బండా రి భాస్కర్, గీతా రెడ్డి, గంగాధర్ రెడ్డి, శివసింగ్, అనిల్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, హనుమంత్ నాయక్, నరేంద్ర ముదిరాజ్, సంజీవ్, అశోక్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.