07-04-2025 01:04:35 AM
జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కుక్కు గంగాధర్ అన్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్ని వార్డుల్లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమలనుద్దేశించి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో పని చేయడం తన అదృష్టం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పని చేస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి సత్తా చాటుకుంటుందన్నారు. జగిత్యాల పట్టణంలో ఆన్ని వార్డ్ లో బిజెపి పార్టీ బలమైన అభ్యర్థులు ఉన్నారని జగిత్యాల మున్సిపల్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, సిరికొండ రాజన్న, బిజెపి జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, బిజెపి నాయకులు ఇట్యాల రాము, ముద్దం రాము, వోడ్నాల మహేష్, వోడ్నాల రమేష్, నాగభూషణం, రాగిళ్ల నారాయణ, కొక్కు రాములు, మామిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు.