calender_icon.png 21 February, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

14-02-2025 12:26:56 AM

నేడు సంగారెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాక సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి 

సంగారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయ క్రాంతి) : బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య లకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమావేశానికి హాజరవుతున్నారని సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం సంగారెడ్డి సమీపంలోని ఎల్ ఎన్ కన్వెన్షన్‌లో ఉదయం 11 గంటలకు బీజేపీ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే శంకర్రావు హాజరు కావడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పటాన్ చెరు నియోజకవర్గంలోని ఆర్ సి పురంలోని శ్రీ కన్వెన్షన్ లో పట్టభద్రులు, టీచర్ల సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు. మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పరెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.