calender_icon.png 8 February, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి

08-02-2025 12:49:07 AM

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి

కామారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయ క్రాంతి), రానున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం బిజెపి జిల్లా కార్యాలయంలో నూతనంగా ఎంపికైన బిజెపి జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పదవి బాధ్యతల ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ఇందుకోసం కార్యకర్తలు నాయకులు సైనికు లు లాగా పనిచేయాలని అన్నారు. అనంతరం పలువురు బిజెపి నాయకులు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల లక్ష్మారెడ్డి బిజెపి కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు పోతంగల్ కిషన్ రావు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి పైలా కృష్ణారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు విపుల్ జైన్ కుంట లక్ష్మారెడ్డి అంజల్ రెడ్డి నరేందర్ శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఆకుల భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.