calender_icon.png 20 April, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ పాలన

15-04-2025 12:00:00 AM

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): దేశ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సామజిక న్యాయం అందించిన అంబెడ్కర్ రాజ్యాంగానికి వ్యతరేకంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగా ణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. మనుస్మృతి బీజేపీ కి చట్టం, అంబే ద్కర్ రాజ్యాంగం కాదని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబెడ్కర్ 134 వ జయంతి సందర్బంగా సోమవారం  హైదరాబాద్ లోయర్  ట్యాంక్ బండ్లో అం బేద్కర్ విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్ తదితరులు ఫూల మాలలు వేసి ఘనంగా నివా ళులు అర్పించారు.

ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ పేదలకు అధికారం ఇస్తు, పాలనకు నైతిక మార్గదర్శిగా పనిచేస్తున్న భారత రాజ్యాంగాన్ని బీజేపీ క్రమపద్ధతిలో ద్వంసం చేసుకుంటూ వస్తుందని, రాజ్యాంగం తోపాటు ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. చట్ట సవరణల పేరుతో దేశ ప్రజల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజల స్వేచ్ఛ, హక్కులపై, రాజ్యాం గంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పోరాటాలు నిర్వహించి  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యా న్ని, లౌకికవాదాన్ని రక్షించుకుంటామని డాక్ట ర్ దిడ్డి సుధాకర్  తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆప్ నేతలు సుధారాణి, డా. లక్ష్య నాయుడు, జావేద్ షరీఫ్, అజిమ్ బేగ్, మోనికా, రాకేష్ రెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి, నాగేందర్ ప్రసాద్, రాకేష్ పాల్గొన్నారు.

 ఆశయాలను రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర మనువాద ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయి..

 బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్..

అంబేద్కర్ ఆశయాలను కేంద్ర రాష్ట్ర మనువాద ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్య క్షుడు,  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వడ్లమూరు కృష్ణ స్వరూప్ అన్నారు.  డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135 వ జయంతిని అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ పోరాట దివాస్ గా పాటిస్తూ దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.   

స్థానిక లిబర్టీ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన జరిగిం ది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పార్టీ జాతీయ అధ్యక్షులు,  సుప్రీంకోర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పూల మాల తో ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర మనువాద  ప్రభుత్వాలు ధ్వంసం చేస్తున్నాయని దళిత బహుజన మానవ హక్కులను చట్టాలను రద్దు చేస్తున్నారని, చివరకు రా జ్యాంగాన్ని రద్దు చేయడానికి మోడీ బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసంసోషల్ జస్టిస్ కోసం మనువాద పాలకులపై రాజకీయ పోరాటం చేయాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ జీవిత ఆశయమైన దళిత బహుజన జాతులు రాజ్యాధికార సాధన ద్వారానే విముక్తి అవుతారని ఇదే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన ఘనమైన నివాళులని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షు లు డాక్టర్ వి.ఎల్. రాజు. జాతీయ ప్రధాన కార్యదర్శి సంకు శ్రీనివాసులు. జాతీయ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ భాస్కరరావు  తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అశోక్. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర్షల  రాజు. దళిత బహుజన స్టూడెంట్ ఫెడరేషన్  డీవీఎస్‌ఎఫ్ రాష్ట్ర కో. ఆర్డినేటర్ ఇటికాల గణేష్. దళిత బహుజన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి లావ ణ్య. హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు వరదా జ్యోతి. బేకరీ సంక్షేమ సంఘం అధ్యక్షులు. పి. సుచంద్ర పాల్గొన్నారు.

అంబేద్కర్  ఆశయ సాధనకు కృషి చేయాలి

ఎల్బీనగర్, ఏప్రిల్ 14 : రాజ్యాంగం లో పొందుపార్చిన మన హక్కులను ఖచ్చితంగా పాటించినప్పుడే అంబేద్కర్ ఆశయ సాధనకు నాంది అని, డిపో మేనేజర్ విజయ్ అన్నారు. హయత్ నగర్ 1 డిపోలో 134వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమం లో సహాయ మేనేజర్లు విజయ కుమారి, సత్తయ్య, శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, మైస నరేశ్, యాదయ్య సతీశ్, భాగ్య, సక్రు, సోమయ్య రవి, ఉదయశ్రీ పాల్గొన్నారు.