13-04-2025 12:43:57 PM
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి.
చిట్యాల,(విజయ క్రాంతి): బిజెపి ప్రభుత్వం(BJP Govt) కుల మత విద్వేషాలు సృష్టించడమే కాక, రాజ్యాంగాన్ని అవమానిస్తుందని చిట్యాల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు(Chityala Congress) గూట్ల తిరుపతి అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకుతండా,వెంచరామి గ్రామాలలో జై బాపూ,జై భీమ్,జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా గూట్ల తిరుపతి మాట్లాడుతూ..బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని(Constitution) తొలగించే ప్రయత్నం చేస్తుందన్నారు.రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాల రాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉందని,కుట్రలను సాగనివ్వమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గడ్డం కొమురయ్య,పాపిరెడ్డి,రామ్ రెడ్డి, సంతోష్, కాసంరాజిరెడ్డి, సంపత్, రాకేష్ ,నందునాయక్,మాణిక్యం, దేవేందర్, నందరాజు నాయక్, రాజు నాయక్,రమణాకర్, శశి, రమణారెడ్డి, నాయిని స్వామి తదితరులు పాల్గొన్నారు.