08-02-2025 05:54:16 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందిబి మోగించడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘన విజయం సాధించిన జిల్లా మాజీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెత్రుత్వం లో మిటాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవటం జరిగింది. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ మోడీజీ నాయకత్వంలో గెలుస్తుంది అని దేశమంతా బీజేపీ మోడీజీ ...మోడీజీ అని నిన్నదిస్తున్నారు. అవినీతి లేని పరిపాలన అందిస్తాం అని ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజీరివాల్ తనే అవినీతి చేసి జైలు పాలు అయ్యాడు అని అన్నారు చిపిరి తో అవినీతిని ఊడ్చేస్తాం అని చెప్పిన కేజరివాల్ ఢిల్లీ లో ఆమ్ ఆద్మీని ప్రజలు ఊడ్చేశారు అని అన్నారు.
కాంగ్రెస్ ఒక్క సీట్ కూడా గెలవకుండా గుండు సున్నా గాడిద గుడ్డు అయ్యింది. కాంగ్రెస్ దేశంలో ముక్త కాంగ్రెస్ కి అతి సమీపంలో ఉంది అని మరో సారి ఢిల్లీ ఎన్నికలు సూచిస్తుంది అని అన్నారు. మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కి కర్రు కాల్చి ప్రజలు వాత పెట్టారు అని అన్నారు. తెలంగాణలో జరిగే MLC ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఓటమి తప్పదు అని తెలంగాణలో అన్ని ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపాక రమేష్, భూక్యా రవినాయక్, కటికల రంజిత్, యానాలా ముకుంద్, రెడ్డి, సుధాకర్ అలవాల సందీప్ బట్టు శివ కల్లోజి నాగరాజు, ముత్యాల భాస్కర్, మురళి యాదవ్, కళ్యాణ్ అవినాష్, లాలూ నాయక్, శ్రీకాంత్ కుమార్, వంశీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.