18-02-2025 06:44:41 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మంగళవారం బీజేపీ జిల్లా నాయకులు బాపురెడ్డి పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కళాశాలలను, పాఠశాలలను సందర్శించి మొదటి ప్రాధాన్యత ఓటును అంజిరెడ్డికి వేయవలసిందిగా అధ్యాపకులను ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొనాల గంగారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.