18-03-2025 01:35:55 AM
హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మరో ఏడు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను నియమించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ఇంచార్జి, రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ సోమవారం ఈ విషయం ఒక ప్రకటనలో తెలిపారు. వానిపల్లి శ్రీనివాస్ రెడ్డి (రంగారెడ్డి అర్బన్), పం తంగి రాజ్ భూపాల్ గౌడ్ (రంగారెడ్డి రూ రల్) కొప్పు రాజశేఖర్ రెడ్డి, (వికారాబాద్), వేముల నరేందర్ రావు (నాగర్‌కర్నూల్), టి. రమాంజనేయులు (జోగులాం బ గద్వాల్), నెల్లూరి కోటేశ్వరరావు (ఖమ్మం), బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), జే. నిరంజన్ యాదవ్ (భాగ్యనగర్ మలక్‌పేట్) నియమితులయ్యారు. వీరితో పాటు 32 మందిని స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి గీతామూర్తి వెల్లడించారు.