calender_icon.png 14 February, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 4 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులు

14-02-2025 01:27:06 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : ఈనెల 3న 19 జిల్లాలకు పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం గురువారం మరో 4 జిల్లాలకు నూతనంగా అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షుల నియామకాలను వెల్లడించారు.

టి ఉమా మహేంద్ర (గోల్కొండ గోషామహల్), వల్లభు వెంకటేశ్వర్లు (మహబూబాబాద్), సి గోదా వరి (సంగారెడ్డి), ఊటుకూరు అశోక్ గౌడ్ (యాదాద్రి భువనగిరి)లను అధ్యక్షులుగా నియమించారు. 

రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా..

వై అనిల్‌కుమార్ చారి (కార్వాన్), బి యోగేష్ ముదిరాజ్ (గోషామహల్), కేడల దినేష్ (చార్మినార్), నీలికుర్తి గోవర్ధన్ రెడ్డి (డోర్నకల్), శ్యాం సుందర్ శర్మ (మహబూబాబాద్), మారుతి రెడ్డి (నారాయణ్‌ఖేడ్), గౌరగల్ల యాదగిరి (అందోల్), వెరుపుల అశోక్ (జహీరాబాద్), గొల్ల సత్యమ్మ (సంగారెడ్డి), వీరారెడ్డి (పటాన్‌చెరు), బి గోపాల్ రెడ్డి (భువనగిరి), రచ్చ శ్రీనివాస్ (ఆలేరు)లను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించారు. మరోవైపు ఘోషామహల్ నియోజకవ ర్గంలో తాను సూచించిన నేతకు పదవి ఇవ్వలేని ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.