మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, మే 11 (విజయక్రాంతి): మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వ హించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీజేపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ‘పాన్’ ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వసూళ్లపై ఇప్పటికే అనేక పత్రికల్లో కథనాలు వచ్చాయని స్పష్టంచేశారు. వ్యాపారులే వీరి టార్గెట్ అన్నారు. ఇక ఆ పార్టీ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపిస్తే ఇంకా అనర్థం జరుగుతుం దన్నారు.
తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా, ఏనాడూ అవినీతికి పాల్పడలేదన్నారు. హిందుత్వంపై కనీస అవగాహన లేని వారు కూడా ధర్మం గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చా రు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజ్జగిరి నారాయణ, పట్టణ అధ్యక్షుడు అజయ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, ఏజా జ్, రాజు, గెడం రాము, నయీం, పర్వీన్ సుల్తానా పాల్గొన్నారు.