calender_icon.png 26 December, 2024 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ సీఎంని జైలుకు పంపాలని బీజేపీ పన్నాగం: కేజ్రీవాల్

25-12-2024 06:22:06 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక ఓటమిని చవిచూడనుందన్నారు. ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి లభిస్తున్న ఆదరాభిమానాలను చూసి బీజేపీ భయపడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మర్లెనాని  త్వరలో అరెస్టు చేస్తారని ఎక్స్ వేదికగా కేజ్రీవాల్ వెల్లడించారు. తప్పుడు కేసులతో ఢిల్లీ సీఎం అతిశీని జైలుకు పంపాలని బీజేపీ పన్నాగం పన్నుతోందని ఆయన ఆరోపింరు. బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం చాలా మంది ఆప్ ఆగ్రనేతలపై దండయాత్రకు సిద్దమవుతోందని, కొందరి ఇళ్లలోను సోదాలు చేస్తారని చెప్పారు. ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆపాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.