06-04-2025 04:27:12 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పాల్వంచలోని స్థానిక ధమ్మపేట సెంటర్ లో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జెండాను పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఎగరవేసినారు. అనంతరం మిఠాయిలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలోని ప్రజలు రోజురోజుకు బీజేపీ పార్టీ మీద విశ్వాసం పెంచుకుంటున్నారని, దేశ అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్న పార్టీ కేవలం బీజేపీనే అని బీజేపీ పార్టీలో మాత్రమే దేశం కోసం ధర్మం కోసం స్వార్థం లేకుండా పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉంటారన్నారు.
వ్యక్తిగత స్వార్దాలు లేకుండా సమాజం కోసం పాటుపడే కార్యకర్తలు నాయకులు ఉండే పార్టీ బీజేపీ అన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ దేశ ప్రజందరికి ఒకే విధంగా న్యాయం చెయ్యగల నాయకత్వం ఉన్న పార్టీ బీజేపీ అని అతి త్వరలో మిగిలిన రాష్ట్రాలలో కుడా కచ్చితంగా కాషాయ జెండా ఎగరవేసే సమయం ఆసన్న మైందన్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ప్రధానులు కేంద్రమంత్రులు ముఖ్యమంత్రులు పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే ఏకైక పార్టీ ఈ ప్రపంచంలోనే బీజేపీ అన్నారు. మోడీ అమిత్ షా నాయకత్వంలో బీజేపీ పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్, నారాయణ, ప్రశాంత్, దిలీప్, లక్ష్మణ్, శ్రీను, సీతారాములు, రాము, రాజు, నరేందర్, విజయ్, రాంబాబు, నరేష్, హాథిరామ్, సత్యం, వినయ్, రాంబాబు, జలీల్, రంజిత్, వినోద్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.