calender_icon.png 8 April, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ వేడుకలు

06-04-2025 08:06:28 PM

కొండపాక: కుకునూరు పల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం బిజెపి పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంచి పెట్టుకున్నారు. వివిధ గ్రామాల బిజెపి పార్టీ బూత్ అధ్యక్షులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యాయులు, మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.