23-02-2025 09:08:22 PM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేది, ఎళ్లవేళలా ప్రజలకు అండగా ఉండేది బీజేపీ పార్టీయేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ(Kaytanapally Municipality) పరిధిలోని ఎంఎన్ ఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి నిర్వహించిన జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో కేసులు పెట్టారని, అయినా భయపడేది లేదని, ఇలాంటివి మరెన్ని కేసులు పెట్టినా సమస్యల సాధనకు పోరాడుడేనన్నారు. ఇప్పటికీ ప్రజలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, రైతుల, మహిళల పక్షాన పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Govt) హయాంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి అని, పెన్షన్ పెంపు, కళ్యాణలక్ష్మి తులం బంగారం, నిరుద్యోగ భృతి అటే పోయిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, రైతు భరోసా ఏమాయే, రుణ మాఫీ, కౌలు రైతులకు భరోసా ఇలా ఏ ఒక్కటి నెరవేర్చలేడన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండు ఒక్కటేనన్నారు. డ్రగ్స్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫార్ములా కార్ రేస్ ఇలా అన్ని కాంగ్రెస్ మాఫీ చేసింది కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా టీచర్లు, గ్రాడ్యుయేట్ల కోసం పోరాటాలు చేసిందా! 317 జీవోకు వ్యతిరేకంగా ఎప్పుడైనా స్పందించిందా! అని ప్రశ్నించారు. తపస్ మాత్రమే ఉపాధ్యాయు) కోసం పోరాడిండని, బీజేపీ నాయకులు నిరుద్యోగులకు అండగా నిలిచారని, కొట్లాడింది. జైళ్లకు వెళ్లింది బీజేపీ నాయకులేనన్నారు.
టీచర్ల సమస్యలపై తపస్ పోరాడుకుంటే పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, డీటీఎఫ్ సహా ఏ ఒక్క సంఘమైనా ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులు, గ్రూప్1 -అభ్యర్థుల పక్షాన పోరాడితే హిందీ పేపర్ లీకేజీ చేశానంటూ దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఉద్యోగులు, టీచర్లు, నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉండేది బీజేపీ అని, పోరాడేది మేమేనన్నారు. ఓట్లు అడిగే హక్కు కూడా మాకే ఉందన్నారు. 27న జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections)లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.