హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ ఎంపీలు
హైదరాబాద్, డిసెంబర్29 (విజయక్రాం తి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన బీజేపీ జాతీయ సంస్థాగత సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుల సమావేశాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎంపీ కే లక్ష్మ ణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ ఎంపీ నేతగాని వెంకటేశ్ తదితరులు హాజరయ్యారు.
రాష్ట్రాల్లో సాగుతున్న సంస్థా గత ఎన్నికలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టు సమాచారం. త్వరగా సంస్థాగ త ఎన్నికల ప్రక్రియను చేపట్టి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేయాలని జాతీయ నేతలు దిశానిర్దేశం చేసి నట్లుగా ఎంపీలు తెలిపారు.