- హాజరుకానున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
- ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా యెండల
హైదరాబాద్, నవంబర్ 25 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత ఎన్నికలకు బీజేపీ కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈనెల 29, 30వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కేం ద్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన కార్యశాలను చేపట్టనున్నది. ఈ కార్యక్రమానికి కేంద్ర గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
పార్టీ చేపట్టనున్న ఈ ఎన్నికల ప్రక్రియకు బీజేపీ సీనియర్ నాయకుడు యెం డల లక్ష్మీనారాయణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, మండలాలకు అధ్యక్షుల నియామకంపై వర్కషాప్లో కసరత్తు చేయనున్నారు. దీంతోపాటు ఎన్నికలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలని పార్టీ నాయకులకు, కార్యక ర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.