- యూత్ కాంగ్రెస్ నేతలకు పోలీసుల సహకారం
- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాం తి): సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోనే మంగళవారం 200 మంది యూత్ కాంగ్రెస్ నేత లు బీజేపీ రాష్ట్రకార్యాలయంపై దాడి చేశారని, తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాశారు.
యూత్ కాంగ్రెస్ నేతల దాడిలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ , దళిత మోర్చ నేత నందు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అక్కడే ఉండి కూడా చూస్తూ ఉండిపోయారని, కనీసం ఆపేందుకు కూడా ప్రయత్నించలేదని వాపోయారు.
పోలీసుల సహకారం తోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలను బెదిరించడం, అవసరమైతే అణచివేయడం కాంగ్రెస్ సర్కార్‌కు ప్రణాళికగా మారిందని విమర్శించారు. గవర్నర్ వెంటనే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని, దాడి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.