18-02-2025 12:36:16 AM
2023-24లో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు సగం కూడా రాని వైనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల ఆదాయా న్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ప్రకటించింది. ఈ జాబితాలో బీజేపీ తొలిస్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరా నికి గాను వివిధ రాజకీయ పార్టీల ఆదాయం రూ. 5820.912 కోట్లుగా ఉంది.
ఇందులో బీజేపీ ఆదాయం రూ 4340.473 కోట్లు కాగా.. కాంగ్రెస్ పార్టీ రూ. 1225.119 కోట్లు. అదే సమయంలో కమ్యూనిస్టులకు రూ. 167.636 కోట్లు ఆదాయం సమకూరగా.. బీఎస్పీకి మాత్రం రూ. 64.7798 కోట్లు, ఆప్ రూ. 22.68 కోట్లు ఆదాయంగా ప్రకటించాయి.
50 శాతమే ఖర్చు..
2023 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఆదాయం రూ. 4340. 473 కోట్లు కాగా.. ఆ పార్టీ అందులో కేవలం 50.96 శాతమే ఖర్చు చేసినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ ఆదాయం రూ. 1225.12 కోట్లు కాగా.. అందులో నుంచి 83.69 శాతం కాంగ్రె స్ ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. జాతీయ పార్టీలకు ఎక్కువ భాగం విరాళాలు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనే సమకూరినట్లు నివేదిక వెల్లడించింది.
ఆప్‌కు రూ. 22.68 కోట్ల ఆదాయం రాగా.. రూ. 34.097 కోట్లను ఆ పార్టీ ఖర్చు చేసినట్లు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీలకు రూ. 5820.912 కోట్ల ఆదాయం సమకూరగా.. ఆ యా పార్టీలు అందులో నుంచి రూ. 34442.654 కోట్లు ఖర్చు చేశాయి.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌ల ఆదాయాలు పెర గ్గా.. ఆప్, బీఎస్పీ, ఎన్పీఈపీ పార్టీల ఆదాయాలు తగ్గాయి. పార్టీలు తమ ఆదాయంలో సింహభాగాన్ని ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనే సేకరించాయి. ఈ ఎలక్ట్ట్రోరల్ బాండ్లు రా జ్యాంగ విరుద్ధమైనవని, పూర్తి ఏకపక్షంగా ఉన్నాయని గత మేలో సుప్రీం ఈ బాండ్లపై వ్యాఖ్యా నించిన విషయం తెలిసిందే.
4500 కోట్లకు పైనే..
జాతీయ బ్యాంకు ఎస్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,507.56 కోట్ల విలువైన ఎలక్ట్రోరల్ బాండ్లను వివిధ పార్టీలు రీడీమ్ చేసుకున్నట్లు బ్యాంకు తెలిపింది. ఎన్నికలకు సంబంధించే అన్ని పార్టీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత సాధారణ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల కోసం పార్టీలు అధిక నిధులను వెచ్చించాయి.
మరోసారి.. ఎలక్ట్రోరల్ బాండ్లే
ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ. 1685.62 కోట్లను సమకూర్చుకోగా.. కాంగ్రెస్ రూ. 828.36 కోట్లు, ఆప్ రూ. 10.15 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్లు, ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌ల ద్వారా సమకూర్చుకున్నాయి. కమ్యూనిస్టు, బీఎస్పీ, ఎన్పీపీ పార్టీలకు నిధులేవీ ఈ విధానంలో చేకూరలేదు.
ప్రాంతీయ పార్టీలలో బీఆర్‌ఎస్ టాప్..
ప్రాంతీయ పార్టీల ఆదాయంలో బీఆర్‌ఎస్ రూ. 737.677 కోట్ల నిధులతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో అధికారిక డీఎంకే పార్టీ రూ. 214.353 కోట్ల ఆదాయంతో మూడో స్థానంలో నిలిచింది. టీడీపీ 63.994 కోట్ల ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచింది.