ఎల్బీనగర్, నవంబర్ 14 : ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నిర్వాసితులకు భరోసా కల్పించేందుకు శనివారం బీజేపీ నిద్రదీక్ష చేపట్టనుందని చైతన్యపురి కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా తెలిపారు. గురువారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..
చైతన్యపురి డివిజన్లోని ఫణిగిరి, న్యూమారుతీనగర్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో నిద్రదీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. మూసీ పునరుద్ధరణ పేరుతో ప్రభుత్వం పేదలను ఇండ్ల నుంచి తరిమేస్తోందని..
మూసీ నిర్వాసితులకు భరోసా, ధైర్యం కల్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ ఈటల నిద్ర దీక్ష చేయనున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఎంపీ దీక్షకు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.